
ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పలు పథకాలు అమలులో ఉన్నాయి. ఆ పథకాల్లో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు ముఖ్యంగా ఉన్నాయి. ఈ పథకాలు ప్రజలకు మరింత సహాయం చేస్తుండగా తల్లికి వందనం పథకం కూడా ఇప్పుడు అమలు కానుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం గురించి ఒక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15000 అందిస్తాం అని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంట్లో స్కూల్ కి వెళ్లే పిల్లలందరికీ రూ. 15000 అందించడం జరుగుతుంది. పథకంలో భాగంగా ఎంత మంది పిల్లలు ఇంట్లో ఉన్నా వారందరికీ ఈ రూ.15000 వర్తిస్తుంది.
ఈ పథకం విద్యార్థుల కోసం వారి చదువుకు సహాయం చేయడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో రూపొందించబడింది. విద్యార్థులు తమ చదువుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్, చదువు సంబంధిత ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఈ డబ్బులు వినియోగించుకోవచ్చు.
ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చలు జరగగా జూన్ లోగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక పథకాన్ని అమలు చేసింది. కానీ ఆ పథకం కింద ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించబడింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కొత్త తల్లికి వందనం పథకంతో విద్యార్థుల అందరికి రూ. 15000 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రతి విద్యార్థి తమ చదువుకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ పథకం విద్యార్థులకు మరింత సహాయం అందించడం వల్ల వారు చదువును మధ్యలో ఆపకుండా చదువుకుంటారు.
ఈ తల్లికి వందనం పథకం వల్ల విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు ఉండటం వలన చదువు మానేసే పరిస్థితులు ఇక ఉండవు. వారి చదువు కొనసాగించేందుకు కావలసిన నిధులు అందుతాయి. ఈ విధంగా పథకం విద్యా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఒక మార్గాన్ని చూపిస్తుంది.