HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ బెంగళూరులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

|

Nov 26, 2021 | 7:28 PM

HAL Recruitment 2021: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫకేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఏఎల్‌ బెంగళూరులోని సంస్థలో పోస్టులను భర్తీ చేయనున్నారు...

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ బెంగళూరులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Hal Jobs
Follow us on

HAL Recruitment 2021: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫకేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఏఎల్‌ బెంగళూరులోని సంస్థలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా స్టాఫ్‌ నర్స్‌, ఫిజియోథెరపిస్ట్‌, ఫార్మసిస్ట్‌, డ్రెస్సర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* స్టాఫ్‌ నర్స్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు జనరల్‌ నర్సింగ్, మెడ్‌వైఫరీలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

* ఫిజియోథెరపిస్ట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ఫిజియోథెరపీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

* ఫార్మసిస్ట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు డీఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

* డ్రెస్సర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు ప్రథమ చికిత్స విభాగా ట్రెయినింగ్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15000 నుంచి రూ. 21,473 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: షుగర్‌ వ్యాధి కారణంగా స్వీట్లకు దూరంగా ఉంటున్నారా..! ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

AP Weather: ఏపీకి మరో టెన్షన్.. వరద ముప్పు నుంచి తేరుకోకమునుపే మరో అల్పపీడన గండం

మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ !! మోటో జీ పవర్‌ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో