వర్క్ ఫ్రమ్ హోం విధానం నుంచి గూగుల్ క్రమంగా వెనక్కి వస్తోంది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగులు తప్పసరిగా ఈ పాలసీని పాటించేలా కీలక ఎత్తుగడ వేసింది సెర్చింజన్ దిగ్గజం గూగుల్. కరోనా కారణంతో ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం సిస్టమ్పెట్టాయి. అందుకు తగిన ఏర్పాటు సైతం చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో టెక్ దిగ్గజం గూగుల్ చేరిపోయింది. రిటర్న్ టూ ఆఫీస్ పాలసీని ప్రకటించింది. వారానికి కచ్చితంగా మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని గూగుల్ తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. ఇకపై ఉద్యోగుల పనితీరును అంచనా వేయడంలో హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని మెయిల్ పంపింది. రిటన్ టూ ఆఫీస్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులు పేలవమైన పెర్ఫామెన్స్ రివ్యూ పొందుతారని హెచ్చరించింది. పెర్ఫామెన్స్ రివ్యూ సందర్భంగా ఉద్యోగుల హాజరును తనిఖీ చేస్తామని తేల్చిచెప్పింది.
మేలో జరిగిన గూగుల్ వార్షిక సమావేశంలో ఆవిష్కరించిన ప్రొడక్ట్‌లలో చాలా వరకు ఒకే దగ్గర కూర్చొని సమన్వయం చేసుకున్న ఉద్యోగులే అభివృద్ధి చేశారని గూగుల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సమన్వయంతో పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధించొచ్చని తెలిపింది. అయితే, వర్క్ ఫ్రమ్ హోం విధానంపై కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అస్పష్టమైన హాజరు విధానాల ద్వారా తమ పనితీరును అంచనా వేయడం ఏమాత్రం సరికాదని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తెలిపారు.
ప్రస్తుతం గూగుల్ హైబ్రిడ్ పాలసీని అమలు చేస్తోంది. అంటే ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసులో రిపోర్ట్ చేయాలి. ప్రస్తుతం తీసుకొచ్చిన రిటర్న్ టూ పాలసీ ద్వారా ఎవరైతే తరుచుగా ఆఫీసులకు రాకుండా అటెండెన్స్ మెయిటెయిన్ చేయకపోతే వారికి హెచ్చరికలు వెళ్తుంటాయి. అటెండెన్స్ సరిగా లేకపోవడం వల్ల శాలరీ హైక్స్, ప్రమోషన్స్‌లో ప్రభావం పడుతుందని గూగులు తమ ఉద్యోగులను పరోక్షంగా హెచ్చరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి