
Employment News: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ జిల్లాలవారీగా కమిషన్ మెంబర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 34 పోస్టులను భర్తీ చేస్తోంది. వీటిలో మహిళలకు 17, పురుషులకు 17 పోస్టులను కేటాయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కమిషన్ పరిధిలో ఒక మహిళ ఉద్యోగి, ఒక పురుషుడికి చెరో పోస్టు కేటాయించింది. అయితే ఉద్యోగానికి అప్లై చేసుకోవడం మాత్రం ఏదైన ఒక జిల్లాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి apcivilsupplies.gov.in. అకడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు.
ఈ కింద తెలిపిన కమిషన్లలో ఈ అవకాశం కల్పించారు. జిల్లాల వారిగా కమిషన్ల వివరాలు ఇలా ఉన్నాయి… అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, మచిలీపట్నం, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం-1, విశాఖపట్నం-2, విజయనగరం, ఏలూరు.
ఉద్యోగ అర్హత:
కన్జూమర్ అఫైర్స్, లా, పబ్లిక్ అఫైర్స్, అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, కామర్స్, ఇండస్ట్రీ, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్/ మెడిసిన్ విభాగాలకు సంబంధించి కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. వీటికి సంబంధించిన స్పెషలైజేషన్లతో పీజీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: దరఖాస్తు చేసుకునే నాటికి అభ్యర్థుల వయసు 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.
ఒప్పంద వ్యవధి: 4 ఏళ్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్లు వచ్చే వరకు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి apcivilsupplies.gov.in.
చివరి తేదీ: ఏప్రిల్ 12, 2021
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఎక్స్ అఫీషియో సెక్రటరీ, వినియోగదారుల వ్యవహారాలు- ఆహారం- పౌర సరఫరాల శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియెట్, వెలగపూడి, అమరావతి.