GATE 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మరో వారంలోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం!

GATE 2026 Notification: గేట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఐఐటీ గువాహటి పూర్తి వివరాలతో కూడి ప్రకటన వెలువరించింది. ఐఐటీల్లో, ఐఐఎస్సీ బెంగుళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, హ్యుమానిటీస్‌ సంబంధిత శాఖల్లో మాస్టర్‌ ప్రోగ్రామ్స్, డైరెక్ట్‌ డాక్టొరల్‌ ప్రోగ్రాములు..

GATE 2026 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. మరో వారంలోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం!
GATE 2026 Notification

Updated on: Aug 18, 2025 | 7:36 PM

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఐఐటీ గువాహటి పూర్తి వివరాలతో కూడి ప్రకటన వెలువరించింది. ఐఐటీల్లో, ఐఐఎస్సీ బెంగుళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కళాశాలల్లో ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌, హ్యుమానిటీస్‌ సంబంధిత శాఖల్లో మాస్టర్‌ ప్రోగ్రామ్స్, డైరెక్ట్‌ డాక్టొరల్‌ ప్రోగ్రాములు, డాక్టొరల్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందొచ్చు. గేట్‌ స్కోరును కొన్ని మహారత్న, నవరత్న, మినీరత్న హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలూ ఉద్యోగ నియామకాలకు కూడా ప్రామాణికంగా తీసుకుంటాయి.

షెడ్యూల్‌ ప్రకారం గేట్‌ పరీక్షకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 25, 2025 నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్‌ 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన్నట్లు ఐఐటీ గువాహటి తెలిపింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 6, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఒక్కో టెస్ట్‌ పేపర్‌కు మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ.2000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక గేట్‌ 2026 ఆన్‌లైన్‌ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ప్రస్తుత ఏడాదిలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఒక అభ్యర్థి ఒక దరఖాస్తు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. గేట్‌ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలకు ఉంటుంది. మూడు గంటల పాటు జరుగుతుంది. నెగటివ్‌ మార్కులు ఉంటాయి. ఒక తప్పు జవాబుకు 33.33 శాతం మార్కులు తొలగిస్తారు. అంటే ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నకు 2/3 చొప్పున మైనస్‌ మార్కులు ఉంటాయి. గేట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు మార్చి 19, 2026న విడుదల చేస్తారు. గేట్‌-2026ను అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్ధులు ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చిన స్కోరు పీజీ ప్రవేశానికి మూడేళ్లు, పీఎస్‌యూల్లో నియామకానికి ఒకటి లేదా రెండేళ్ల వరకు చెల్లుతుంది.

ఇవి కూడా చదవండి

ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.