GATE 2022 Scorecard date: ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (GATE 2022) ఫలితాలు మార్చి 17న విడుదలైన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన స్కోర్ కార్డులను రేపు (మార్చి 22)న విడుదల చేయనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ gate.iitkgp.ac.in. నుంచి స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐతే గేట్ 2022 స్కోర్‌కార్డ్‌ను ఈరోజే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల రిత్యా ఈ తేదీని మార్చి 22కి మార్చారు. కాగా గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. వీటికి సంబంధించిన ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష.. ఇంజనీరింగ్, సైన్స్‌లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్‌మెంట్లకు కూడా గేట్ స్కోర్ ఉపయోగపడుతుంది.
గేట్ 2022 స్కోర్‌కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
Also Read: