GATE 2022 results: గేట్ 2022 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్ అవుతుందంటే..

|

Mar 17, 2022 | 1:23 PM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) ఫలితాలు నేడు (మార్చి 17) విడుదలయ్యాయి..

GATE 2022 results: గేట్ 2022 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్ అవుతుందంటే..
Gate 2022 Results
Follow us on

GATE 2022 Result declared: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) ఖరగ్‌పూర్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE 2022) ఫలితాలు నేడు (మార్చి 17) విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సూట్‌ gate.iitkgpలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన స్కోర్‌కార్డులను మార్చి 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రోల్ నంబర్‌, పాస్‌వర్డ్ లేదా ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. గేట్‌ ఫలితాల (GATE 2022 Results)తో పాటు ఆన్సర్‌ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది ఐఐటీ ఖరగ్‌పూర్. కాగా గేట్ 2022 పరీక్ష ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. వీటికి సంబంధించిన ఫలితాలు ఐఐటీ ఖరగ్‌పూర్‌ నేడు విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష.. ఇంజనీరింగ్, సైన్స్‌లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో రిక్రూట్‌మెంట్లకు కూడా గేట్‌ స్కోర్‌ ఉపయోగపడుతుంది.

GATE 2022 ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌gate.iitkgp.ac.inను ఓపెన్‌ చేసుకోవాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే GATE 2022 Result లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే న్యూ స్క్రీన్‌ ఓపెన్‌ అవుతుంది.
  • రోల్ నంబర్‌, పాస్ వర్డ్ తో లాగిన్‌ అవ్వాలి.
  • వెంటనే స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
  • సేవ్‌ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

Also Read:

Goa Shipyard Limited Jobs: ఇంజనీరింగ్‌ చేసి ఖాళీగా ఉన్నారా? గోవా షిప్‌యార్డులో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!