Hyderabad: నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. SRTRI ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులను ఉచితంగా అందించేందుకు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి..

Hyderabad: నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. SRTRI ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
SRTRI Hyderabad free coaching

Updated on: Apr 27, 2025 | 10:03 AM

హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ ప్రభుత్వ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సులను ఉచితంగా అందించేందుకు ఆసక్తి గల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 5, 2025వ తేదీ నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అకౌంట్స్‌ అసిస్టెంట్‌(ట్యాలీ), కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసిస్టెంట్, ఆటో మొబైల్ 2 వీలర్‌ సర్వీసింగ్‌ వంటి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారు.

ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ (బీకామ్‌), ఇంటర్మీడియట్‌, పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు, డ్రాప్‌ అవుట్స్‌ అర్హులు కారు. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కోర్సు వ్యవధి మొత్తం మూడున్నర నెలల వరకు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ కింది అడ్రస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాల సమయంలో అర్హత గల ఒరిజినల్ సర్టిఫికేట్స్‌, జిరాక్స్‌ సెట్‌, పాస్‌పొర్ట్ ఫోటో, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు సమర్పించవల్సి ఉంటుంది. ఈ చిరునామాకు చేరుకోవడానికి బస్సు, రైలు రవాణా సౌకర్యం కలదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు 9133908000, 9133908111, 9133908222, 9948466111 నంబర్లను సంప్రదించవచ్చు.

అడ్రస్:

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ,

ఇవి కూడా చదవండి

జలాల్‌పూర్‌(గ్రామం),

పోచంపల్లి(మండలం),

యాదాద్రి భువనగిరి జిల్లా,

తెలంగాణ-508 284.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.