Online Interview Tips: కరోనా మహమ్మారి పుణ్యామాని మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. తీసుకునే ఆహారం నుంచి వేషాధారణ వరకు ప్రతి ఒక్క దానిపై వైరస్ ప్రభావం స్పష్టంగా పడింది. సోషల్ డిస్టెన్స్ కారణంగా ఆఫీసులు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ వర్క్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇక సంస్థలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను ప్రోత్సహించడం ఎక్కువైంది. ఈ క్రమంలో నియమకాలు కూడా ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూకి హాజరుకావడానికి కొన్ని రకాల పద్ధతులను పాటిస్తుంటాం. మరి ఆన్‌లైన్ ఇంటర్వ్యూల్లో పాల్గొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అంటేనే పూర్తిగా ఇంటర్‌నెట్‌తో మూడిపడి ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూ ఉన్న సమయంలో సరైన నెట్ ఉండే ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యమైన సందర్భం కాబట్టి వీలైనంత వరకు మొబైల్ ఇంటర్నెట్ కాకుండా.. స్పీడ్ ఎక్కువగా ఉండే బ్రాడ్ బ్యాండ్ సేవలను వినియోగించుకుంటే మంచిది.
* ఇంటర్వ్యూకి హాజరు అయ్యే సమయంలో మీ చుట్టు పక్కాల వెళుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. రిక్రూటర్స్ మీ బాడీ లాంగ్వేజ్ ఆధారంగా కూడా అంచనాకు వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మీరు స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.
* ఇక కేవలం కనబడడమే కాకుండా వినబడడం కూడా అంతే ముఖ్యం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న హెడ్ సెట్లను ఉపయోగించాలి. మీరు చెప్పేది ఏదైనా అవతలి వ్యక్తికి స్పష్టంగా వినిపించేలా చూసుకోవాలి. అదే క్రమంలో వారు చెప్పేది కూడా మీకు వినబడాలి.
* ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌లోనే కదా.. డ్రస్ ఏది వేసుకున్నా పర్లేదు కదా అని టీషర్ట్‌లు లాంటి వేసుకోకూడదు. రిక్రూటర్స్ మీ డ్రస్ సెన్స్‌ను గమనిస్తారనే విషయాన్ని మర్చిపోకూడదు.
* ఇక మీరు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో గదిలో ఎలాంటి శబ్ధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉండేది ఇంట్లో కాబట్టి.. టీవీ సౌండ్, చిన్న పిల్లల అల్లర్లు లేకుండా జాగ్రత్త పడాలి.
* ఇక ఇంటర్వ్యూ ఆన్‌లైన్ అయినా.. ఆఫ్‌లైన్ అయినా.. మీరు సన్నద్ధమవడం మాత్రం ఒకేలా ఉంటుంది. కాబట్టి.. సంబంధిత సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలి. వీలైనంత వరకు అవును, కాదు.. అన్నట్లు కాకుండా వివారణాత్మకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి.
Also Read: మీ దగ్గర రూపాయి నోటు ఉందా..! అయితే సులువుగా 45 వేలు గెలుచుకోండి.. ఎలాగో తెలియాలంటే ఇది చదవండి..