AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Jobs: ఏఐతో ఉద్యోగాల్లో వచ్చే మార్పు ఇదే.. నిపుణులు అంచనా ఏంటంటే..

ఇప్పటికే సంప్రదయ వ్యాపారాలు కూడా డిజిటల్‌గా మారడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక జీతాల విషయంలో కూడా ఏఐ రంగంలో భారీగా ఉండనున్నట్లు రాండ్‌స్టాడ్‌ అంచనా వేస్తోంది. ఏఐ, మెషన్‌ లెర్నింగ్ నిపుణులకు ఏడాదికి రూ. 22 లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏఐ రంగంలో...

AI Jobs: ఏఐతో ఉద్యోగాల్లో వచ్చే మార్పు ఇదే.. నిపుణులు అంచనా ఏంటంటే..
Ai Jobs
Narender Vaitla
|

Updated on: Apr 01, 2024 | 4:53 PM

Share

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్.. ప్రస్తుతం ఈ పదం ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం అనివార్యంగా మారింది. వైద్యం నుంచి ఈ కామర్స్ వరకు అన్ని రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నారు. మనిషి శ్రమను తక్కువ చేసిన ఈ టెక్నాలజీ అదే మనుషుల పొట్ట కొడుతుందనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో భారీగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు కాస్ట్ కట్‌ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి కూడా. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయన్న వార్తలో ఎంత నిజం ఉందో భవిష్యత్తులో భారీగా కొత్త ఉద్యోగకల్పన సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్ నిణులకు భారత్‌లో క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. ప్రముఖ స్టాఫింగ్ సంస్థ రాండ్‌స్టాడ్ ప్రకారం.. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్కి సంబంధించి ప్రతీ ఏటా 30 శాతం ఉద్యోగాలు పెరగనున్నాయని తెలిపారు.

ఇప్పటికే సంప్రదయ వ్యాపారాలు కూడా డిజిటల్‌గా మారడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక జీతాల విషయంలో కూడా ఏఐ రంగంలో భారీగా ఉండనున్నట్లు రాండ్‌స్టాడ్‌ అంచనా వేస్తోంది. ఏఐ, మెషన్‌ లెర్నింగ్ నిపుణులకు ఏడాదికి రూ. 22 లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏఐ రంగంలో చాట్‌బాట్ డెవలపర్‌, ప్రాంప్ట్ ఇంజనీర్‌, ఏఐ ఎథిక్స్‌ స్సెషలిస్ట్‌ వంటి ఉద్యోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కొత్త రోల్స్‌కు రానున్న రోజుల్లో ఫుల్ డిమాండ్‌ ఉండనుందని చెబుతున్నారు. రానున్న 5 ఏల్లలో ఏఐ డెవలపర్స్‌కి భారీగా డిమాండ్‌ ఏర్పడనుందని చెబుతున్నారు. ఇప్పటికే ఏఐ ఆధారిత సిలబస్‌ను పాఠ్యాంశాల్లో సైతం చేర్చారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..