Exam Diet: పరీక్షల సమయంలో పిల్లలకు ఈ డేంజరస్ ఫుడ్స్ పెట్టకండి

|

Feb 11, 2025 | 3:18 PM

మనం తీసుకునే ఆహారం మీదనే మన మన ఆలోచనా తీరు, తీసుకునే నిర్ణయాలు అధిక శాతం ఆధారపడి ఉంటాయి. అసలే పరీక్షల సమయం. ఈ కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మానసికంగా పిల్లలు చురుకుగా ఉంటారు. వారికి మెమరీ పవర్ ను పెంచడంలో కూడా మీరు ఇచ్చే ఆహారం కీలక పాత్రపోషిస్తుంది. పరీక్షల సమయంలో పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది.

Exam Diet: పరీక్షల సమయంలో పిల్లలకు ఈ డేంజరస్ ఫుడ్స్ పెట్టకండి
Exam Diet
Follow us on

పిల్లలు తీసుకునే ఆహారం కూడా వారి ప్రిపరేషన్ మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఇప్పటి నుంచి ఈ విషయాల మీద తల్లులు ఫోకస్ పెట్టగలిగితే వారిలో పరీక్షలకు సంబంధించిన సగం ఒత్తిడిని తగ్గించినట్టే. లేదంటే జీర్ణ సమస్యలు, జ్వరం, ఇన్ఫెక్షన్ల వంటివి పరీక్షల సమయంలో ఇబ్బంది పెడుతుంటాయి. మీ పిల్లల విషయంలో ఇలా జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే వారికోసం తగిన డైట్ ను ఎంచుకోండి. అనారోగ్యం కలిగించే జంక్ ఫుడ్ కు వారిని దూరంగా ఉంచండి. మరి ఈ కీలక సమయంలో విద్యార్థులు ఏం తినాలి.. ఏం తినకూడదు అనే విషయాలు తెలుసుకుందాం..

బ్రేక్ ఫాస్ట్ మరిస్తే మతిమరుపే..

పిల్లలు ఎంత మారాం చేసినా, తినేందుకు ఇష్టపడకపోయినా బ్రేక్ ఫాస్ట్ విషయంలో మాత్రం పేరెంట్స్ కాస్త కఠినంగా వ్యవహరించక తప్పదు. ఎందుకంటే రాత్రి 12 గంటల పాటు ఖాళీగా ఉన్న పొట్ట ఉదయం కూడా సరైన ఆహారం అందకపోతే గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. అది వారి కాన్సంట్రేషన్ ను దెబ్బతీస్తుంది. వారి ఆలోచనా శక్తి సైతం మందగిస్తుంది.

ఈ పదార్థాలకు దూరంగా ఉంచండి…

సహజంగానే ఒత్తిడి, ఆందోళన కారణంగా ఫుడ్ క్రేవింగ్స్ కలుగుతాయి. బయటి ఫుడ్ తినేందుకు పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇవి కూడా పిల్లలకు పరీక్షల ముందు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. మసాలాలు, నూనెలు, స్వీట్లను తక్కువ మోతాదులో.. వీలైతే అస్సలే ఇవ్వకపోవడం మంచింది.

కాఫీ, టీలు మాన్పించండి..

ఏ వయసు వారైనా చదువుకునే వయసులో కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ సమయం మేలుకుని చదివే వారు వీటిని తీసుకోవడం చూస్తుంటాం. దీనికి బదులుగా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లను అందించండి. పరీక్షల కాలం ఎండాకాలం ఒకే సారి వస్తుంటాయి. కూల్ డ్రింకులకు దూరంగా ఉంచడం కూడా ఎంతో అవసరం. రోజుకు సరిపడా మంచినీళ్లు తాగితేనే డీహైడ్రేషన్ దరిచేరదు.

ఇవి తినిపించండి…

  • అల్పాహారంలో శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఇడ్లీ, దోశ, రాగులతో చేసే టిఫిన్లు, ఓట్స్ వంటివి ఇవ్వండి.
  • పాలు, గుడ్లు, పండ్ల ముక్కలను కూడా ఇవ్వడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాదు ప్రొటీన్ కూడా అందుతుంది.
  • లంచ్ లో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులతో చేసే కిచిడీని ఇవ్వచ్చు. అన్నం, చపాతీ ఏది తిన్నా కూరల శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.
  • స్నాక్స్ కోసం సీజనల్ గా దొరికే పండ్లను ఇవ్వాలి. ఇక టీనేజ్ పిల్లలైతే నువ్వులు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తో చేసే స్నాక్స్ ఏవైనా ఇవ్వచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)