ESIC Hyderabad Recruitment 2022: 2 లక్షలకుపైగా జీతంతో..సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో 311 ఉద్యోగాలు..నో ఎగ్జాం!

|

Mar 30, 2022 | 8:55 AM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లో ఉన్న సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Sanath Nagar).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల..

ESIC Hyderabad Recruitment 2022: 2 లక్షలకుపైగా జీతంతో..సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో 311 ఉద్యోగాలు..నో ఎగ్జాం!
Follow us on

ESIC Sanath Nagar Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లో ఉన్న సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Sanath Nagar).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 311

పోస్టులు:

  • ఫ్యాకల్టీ పోస్టులు: 77
  • సూపర్ స్పెషలిస్టు పోస్టులు: 11
  • జూనియర్‌ కన్సల్టెంట్‌ పోస్టులు: 20
  • స్పెషాలిటీ స్పెషలిస్టు పోస్టులు: 5
  • సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు: 97
  • సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు (బ్రాడ్‌ స్పెషాలిటీ): 28
  • జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు: 23
  • జూనియర్‌ రెసిడెంట్ పోస్టులు (బ్రాడ్‌ స్పెషాలిటీ): 37

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లు మించరాదు.

పే స్కేల్‌: నెలకు 60,000ల నుంచి 2,80,254ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ, మెడికల్‌ పీజీ/పీజీ డిప్లొమా/ఎండీ/ఎంఎస్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, నీట్‌ స్కోర్‌ 2021 ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ఏప్రిల్‌ 11న విడుదలకానున్న AP EAPCET 2022 నోటిఫికేషన్‌.. పూర్తివివరాలివే!