ESIC Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ESICలో ఉద్యోగాలు.. నెలకు రూ. రెండున్నర లక్షల జీతం

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 252 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబరు 24, 25వ తేదీల్లో సంబంధిత అడ్రస్‌లో ఇంటర్వ్యూకు హాజరు..

ESIC Jobs 2025: ఎలాంటి రాత పరీక్షలేకుండానే ESICలో ఉద్యోగాలు.. నెలకు రూ. రెండున్నర లక్షల జీతం
ESIC faculty and Non faculty Jobs

Updated on: Nov 18, 2025 | 9:46 AM

ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ESIC).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 252 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబరు 24, 25వ తేదీల్లో సంబంధిత అడ్రస్‌లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇలా..

  • ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 26
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 38
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్య: 54
  • సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల సంఖ్య: 107
  • జీడీఎంఓ పోస్టుల సంఖ్య: 25
  • స్పెషలిస్ట్‌ ఇన్‌ హాస్పిటల్‌ అడ్మిన్‌ (సీనియర్ కన్సల్టెంట్‌) పోస్టుల సంఖ్య: 1
  • స్పెషలిస్ట్‌ ఇన్‌ హాస్పిటల్‌ అడ్మిన్‌ (జూనియర్ కన్సల్టెంట్‌) పోస్టుల సంఖ్య: 1

అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, డెర్మటాలజీ, మెడిసిన్, ఆర్థోపెడిక్స్ పీడియాట్రిక్స్, రేడియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, రేడియోథెరపీ, అనాటమీ ఫిజియాలజీ, ఫార్మకాలజీ ఫోరెన్సిక్ మెడిసిన్, సర్జికల్ సూపర్ బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ ఎండోక్రినాలజీ , మెటబాలిజం హెమటాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌, డిఎన్‌బీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్ల నుంచి 69 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.500.ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ నవంబరు 24, 25 తేదీల్లో జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.2,39,086, అసోసియేట్ ప్రొఫెసర్‌ పోస్టులకురూ.1,55,093, అసిస్టెంట్ ప్రొఫెసర్‌  పోస్టులకు రూ.1,34,047, స్పెషలిస్ట్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌) పోస్టులకు రూ.78,800, సీనియర్‌ రెసిడెంట్‌  పోస్టులకు రూ.67,000 నుంచి రూ.1,34,047 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ అడ్రస్..

ఈఎస్ఐసీ ఎంసీహెచ్‌ దేసులా, ఎంఐఏ, అల్వార్‌ రాజస్థాన్‌ 301030.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.