ESIC Recruitment 2022: హైదరాబాద్‌, చెన్నై ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు..

|

Nov 25, 2022 | 5:01 PM

హైదరాబాద్, చెన్నైలలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. 33 స్పెషలిస్ట్ గ్రేడ్-2 (సీనియర్ స్కేల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ESIC Recruitment 2022: హైదరాబాద్‌, చెన్నై ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు..
ESIC New Delhi
Follow us on

హైదరాబాద్, చెన్నైలలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. 33 స్పెషలిస్ట్ గ్రేడ్-2 (సీనియర్ స్కేల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, క్యాన్సర్ సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, థొరాసిక్ సర్జరీ తదితర తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎం, ఎంసీహెచ్‌, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు డిసెంబర్‌ 27, 2022వ తేదీనాటికి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు డిసెంబర్‌ 27, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.500లు డిమాండ్ డ్రాఫ్ట్‌ చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.78,800ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌ అడ్రస్:

Regional Director,
ESI Corporation, Panchdeep Bhawan,
5-9-23, Hill Fort Road, Adarsh Nagar,
Hyderabad, Telangana-500063.

తమిళనాడు అడ్రస్:

Regional Director,
ESI Corporation, Panchdeep Bhawan,
143, Sterling Road, Chennai-600034.
Tamil Nadu.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.