ESIC Recruitment: ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పలు రీజీయన్‌లలో ఉన్న పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో కూడా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జనవరి 15న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 15 (రేపటితో) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో స్టనోగ్రఫర్ (02), అప్పర్ డివిజన్ క్లర్క్ (07), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (26) ఖాళీలు ఉన్నాయి.
* స్టనోగ్రఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి.
* అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
* మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్టింగ్ (టైపింగ్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 నుంచి రూ. 56,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ జనవరి 15న ప్రారంభంకాగా, ఫిబ్రవరి 15తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Funny Video: అందుకే బ్యాక్ బెంచర్ ముందు కూర్చోకూడదు.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో
Bheemla Nayak: పవర్‌స్టార్ సినిమాలో మరో సర్‌ప్రైజ్.. రంగంలోకి దిగిన క్రేజీ సింగర్..