ESIC Recruitment: ఎంబీబీఎస్‌ చేసిన వారికి ఈఎస్‌ఐలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..

| Edited By: Ram Naramaneni

Dec 15, 2021 | 9:54 AM

ESIC Recruitment 2021: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ వివిధ ఈఎస్‌ఐ...

ESIC Recruitment: ఎంబీబీఎస్‌ చేసిన వారికి ఈఎస్‌ఐలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం..
Esic Jobs
Follow us on

ESIC Recruitment 2021: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ వివిధ ఈఎస్‌ఐ ఆసుపత్రులు/ డిస్పెన్సరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్స్యూరెన్స్‌ మెడికల్‌ ఆఫీసర్లు (ఐఎంఓ) గ్రేడ్‌ 2 (అల్లోపతిక్‌) లో మొత్తం 1120 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్న్‌షిప్‌ చేయని వారు రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

* అభ్యర్థుల వయసు 31-01-2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైణ్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 అందిస్తారు.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 250, ఇతరులు రూ. 500 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 31-12-2021న ప్రారంభమవుతుండగా, చివరి తేదీని 31-01-2022ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: త్వరలో ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు !! వీటి ఉపయోగం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !! వీడియో

Indian Railways: వంద రూట్లలో ప్రైవేట్ రైళ్ళు.. టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వ సన్నాహాలు!

Dry Ginger Benefits: ఎండిన అల్లంతో అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తినొద్దు..