ESIC Recruitment 2021: ఎంప్లాయూస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్యాకల్టీ, కన్సల్టెంటీ, సీనియర్ రెసిడెంట్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక ఇందులో ఎంపిక అయిన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉన్న సనత్ నగర్‌లోని ఈఎస్‌ఐలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. మార్చి 18న మొదలైన దరఖాస్తు ప్రక్రియ మార్చి 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ esic.nic.in లో అప్లై చేసుకోవాలని సూచించారు.
మొత్తం ఖాళీలు – 189
సీనియర్ రెసిడెంట్స్ – 96
అసోసియేట్ ప్రొఫెసర్ – 25
జూనియర్ కన్సల్టెంట్ – 17
ప్రొఫేసర్ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 11
జూనియర్ రెసిడెంట్స్ – 8
కన్సల్టెంట్స్ – 8
సీనియర్ కన్సల్టెంట్ – 7
స్పెషాలిటీ స్పెషలిస్ట్ – 5
సీనియర్ రీసర్చ్ – 5
* అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500ను కేటాయించారు.
* ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు/ESIC ఉద్యోగులు/మహిళలు/పీహెచ్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు.
* ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థులను మొదటి షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూల ఆధారంగా ఎన్నుకుంటారు.
* ముందుగా http://esichydapp.com/user/register వెబ్‌సైట్‌లోకి వెళ్లి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
* ఇందులో భాగంగా అందించే ఈ-మెయిల్ అడ్రస్‌ను కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
* అనంతరం పేర్కొన్న వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి.
* తర్వాత అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి.