EPFO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో 2,674 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే..

|

Mar 24, 2023 | 9:28 PM

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా వివిధ రీజియన్లలో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 2,674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

EPFO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో 2,674 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలున్నాయంటే..
EPFO New Delhi
Follow us on

న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా వివిధ రీజియన్లలో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 2,674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్ సీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీటిల్లో ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో 39, తెలంగాణ రీజియన్‌లో 116 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా డిగ్రీలో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిమిషానికి 35 ఇంగ్లిష్‌లో పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు టైప్‌ చేయగలగాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 27 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్‌ కేటగిరి అభ్యర్ధులు రూ.700లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.