
హైదరాబాద్, ఏప్రిల్ 9: 2024-25 విద్యాసంవత్సరం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పరీక్షలతోపాటు వివిధ కోర్సులకు సంబంధించి తుది పరీక్షలు కొన్ని పూర్తయ్యాయి. ఇంకొన్ని పరీక్షలు నడుస్తున్నాయి. త్వరలోనే అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు వచ్చేస్తాయి. ఇక ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ తర్వాత వివిధ రకాల ఉన్నత కోర్సుల్లో చేరేందుకు పోటీ పరీక్షలు మొదలవుతాయి. వీటిల్లో ర్యాంకు సాధించిన వారికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధిత కోర్సులో సీటు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా సెట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. ఈ పరీక్ష తేదీలు కూడా ఖరారయ్యాయి. దరఖాస్తు ప్రక్రియ సైతం మొదలైంది. ఈ నేపథ్యంలో సమయం వృథా చేయకుండా సన్నద్ధమైతే ఎంచుకున్న కోర్సులో ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాతే అసలు సవాలు మొదలవుతుంది. ఏ కోర్సులో చేరాలి, ఏ మార్గం ఎంచుకోవాలనేది ప్రతి విద్యార్ధి కొచ్చే అతి పెద్ద సమస్య. నీట్ కాకుండా రాష్ట్రస్థాయిలో వ్యవసాయ, ఫార్మసీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈఏపీ సెట్ రాయాల్సి వస్తుంది. అక్కడ వచ్చే ర్యాంకు ఆధారంగా నచ్చిన కాలేజీలో సీటు లభిస్తుంది. ఇక సాధారణ డిగ్రీ పూర్తిచేసిన వారు, ఇంజినీరింగ్ చదివిన వారు పీజీ కోర్సుల్లో చేరేందుకూ పోటీ పడాల్సిందే. ముందు నుంచే ప్రణాళికతో చదివితే పోటీ పరీక్షల్లో మెరవడం సులువే. ఈ క్రమంలో ఏప్రిల్, మే నెల్లల్లో ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.