ECIL Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
ECIL Recruitment: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి..
ECIL Recruitment: హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ ఢిల్లీ శాఖలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇనుస్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. * అభ్యర్థుల వయసు 31-08-2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈసీఐఎల్ జోన్ ఆఫీస్, డీ-15, డీడీడీ లోకల్ షాపింగ్ కాంప్లెక్స్, ఏ-బ్లాక్, రింగ్ రోడ్, న్యూఢిల్లీ, 110028 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 23000 జీతంగా చెల్లిస్తారు. * ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. * ఇంటర్వ్యూను 06-10-2021న నిర్వహించనున్నారు. * నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Intermediate Exams: అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..
UPSC Results: విడుదలైన UPSC సివిల్ సర్వీస్ 2020 తుది ఫలితాలు.. సత్తాచాటిన తెలుగు తేజాలు..
RBI Scholarship: ఆర్‌బీఐ నుంచి నెలకు రూ.40 వేల స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేసుకోండిలా..!