భారత ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలోని హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన 100 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఎస్‌ఈ/ఐటీ/ఈఈఈ/ఈసీఈలో బీఈ/ బీటెక్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలక్షన్ అండ్ ఫీల్డ్ ఆపరేషన్స్, రిజేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విభాగంలో ఏడాదిపాటు అనుభవం కూడా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు 2023, ఆగస్టు 10, 11 తేదీల్లో కింది అడ్రస్లో నిర్వహించే ఇంటర్వ్యలకు నేరుగా హాజరు కావచ్చు. సంబంధిత డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావాలి. ఆయా తేదీల్లో ఉదయం 11 గంటలలోపు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చిరునామాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.25 వేలు, రెండో ఏడాది నెలకు రూ.28 వేలు, మూడో ఏడాది నెలకు రూ.31 వేలు జీతంగా చెల్లిస్తారు. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్‌తోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా కల్పిస్తారు. ఇతర సమాచారం కోసం కింద ఇచ్చిన నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. మొత్తం పోస్టుల్లో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వెనువెంటనే నోటిఫికేషన్లు జారీ చేసి నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.దీంతో ఏపీ నిరుద్యోగుల్లో సంతోషం వెల్లివిరిసింది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.