JNTUH Exams: హైదరాబాద్‌ జెఎన్‌టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా.. భారీ వర్షాలే కారణం. రేపటి పరీక్షలు మాత్రం..

|

Sep 27, 2021 | 11:20 AM

JNTUH Exams: గులాబ్‌ తుఫాన్‌ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలైన వర్షం..

JNTUH Exams: హైదరాబాద్‌ జెఎన్‌టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా.. భారీ వర్షాలే కారణం. రేపటి పరీక్షలు మాత్రం..
Follow us on

JNTUH Exams: గులాబ్‌ తుఫాన్‌ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 8 గంటలకు మొదలైన వర్షం ఇంకా ఎడతెరపి లేకుండా కురుస్తోంది. దీంతో వర్షం ప్రభావం పరీక్షల నిర్వహణపై కూడా పడింది. భారీగా కురుస్తోన్న వర్షం కారణంగా నేడు (సోమవారం) జేఎన్‌టీయూ హైదరాబాద్‌ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

అప్పటికప్పుడు ఉదయం ఈ నిర్ణయాన్ని ప్రటించారు. జేఎన్టీయూహెచ్‌ పరిధిలో జరగాల్సిన బీటెక్‌, బీఫార్మసీ, ఎంటెక్‌ పరీక్షలను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఓ ప్రకటనను జారీచేశారు. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను యథాతధంగా నిర్వహిస్తామన్ని అధికారులు స్పష్టం చేశారు.

రానున్న 5 గంటల్లో అత్యంత భారీ వర్షం..

ఇప్పటికే ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండగా… రానున్న 4-5 గంటల్లో హైదరాబాద్‌లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంతో పాటు ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, నిర్మల్‌ నిజామాబాద్‌, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Switzerland: స్వలింగ సంపర్కుల వివాహాలకు అక్కడ గ్రీన్ సిగ్నల్.. ప్రజాభిప్రాయ సేకరణలో షాకింగ్ మెజారిటీ..

Canada India: భారత విమానాలపై నిషేధం ఎత్తివేసిన కెనడా.. ఈ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే.

Angela Merkel: జర్మనీలో ముగిసిన ఏంజెలా మెర్కెల్‌ శకం.. పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ డెమొక్రాట్ల పైచేయి..