DSSC Recruitment 2022: టెన్త్‌/ఇంటర్ అర్హతతో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌ ఉద్యోగాలు..నెలకు రూ.63 వేల జీతం..

|

Oct 13, 2022 | 2:51 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ (నీలగిరి)లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్.. లోయర్ డివిజన్ క్లర్క్, సివిలియన్ మోటార్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్‌ 'సీ' సివిలియన్‌) పోస్టుల భర్తీకి..

DSSC Recruitment 2022: టెన్త్‌/ఇంటర్ అర్హతతో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో గ్రూప్‌ సీ సివిలియన్‌ ఉద్యోగాలు..నెలకు రూ.63 వేల జీతం..
DSSC Tamil Nadu
Follow us on

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లింగ్టన్ (నీలగిరి)లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్.. 12 లోయర్ డివిజన్ క్లర్క్, సివిలియన్ మోటార్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (గ్రూప్‌ ‘సీ’ సివిలియన్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైపింగ్ స్పీడ్ స్కిల్స్‌, హెవీ వెహికల్స్ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.

అభ్యర్ధుల వయసు అక్టోబర్‌ 28, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 28, 2022 వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనరల్‌/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.850లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.650లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.47,900ల నుంచి రూ.63,840లు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఆధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వారీగా జీతభత్యాల వివరాలు ఇవే..

  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టులకు నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నెలకు రూ.18,000ల నుంచి రూ.56,900ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్: The Commandant, Defence Services Staff College, Wellington (Nilgiris) – 643 231. Tamil Nadu.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.