DRDO Recruitment 2021: భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 106 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని చండీపూర్‌లో ఉన్న ప్రీమియర్ ల్యాబరేటరీ ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
* మొత్తం 106 ఖాళీలకు గాను గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 50, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ 30, ట్రేడ్ అప్రెంటీస్ 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్‌కు దరఖాస్తు చేసుకునే వారు సంబంధింత బ్రాంచ్లో డిప్లొమా చేసి ఉండాలి. ఇక ట్రేడ్ అప్రెంటీస్‌కు పోస్టుకు సంబధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఇక ఈ పోస్టులకు 2019, 2020, 2021లో బీఈ, బీటెక్, డిప్లొమా, బీబీఏ, బీకామ్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తు చేసుకోరాదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 9000, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు రూ. 8000 స్టైపెండ్ ఇస్తారు.
* అభ్యర్థులను విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు.. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
SAI Recruitment: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..