DRDO-DIAT Recruitment 2022: డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

|

Sep 16, 2022 | 3:31 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ పరిధిలోని గాంధీనగర్‌లోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (DRDO-DIAT).. ల్యాబొరేటరీ ఆఫీసర్‌, సూపరిటెండెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌..

DRDO-DIAT Recruitment 2022: డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో ఉద్యోగావకాశాలు.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
Drdo Diat
Follow us on

DRDO-DIAT Laboratory Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ పరిధిలోని గాంధీనగర్‌లోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (DRDO-DIAT).. 13 ల్యాబొరేటరీ ఆఫీసర్‌, సూపరిటెండెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ తదితర (Laboratory Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌/సోషల్‌ సైన్స్‌/కామర్స్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/మెకానికల్‌ ఇంజనీరింగ్‌ లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఎంబీఏ/ఎంసీఏ/ఎంపీఎమ్‌/ఎంఫిల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే టైపింగ్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు దరఖాస్తు రుసుమ చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌లిస్టింగ్‌/ప్రెజెంటేషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: The Deputy Registrar (Admin), Defence Institute of Advanced Technology (Deemed to be University), Girinagar, Pune (Maharashtra)-411025.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.