భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని అవడిలోనున్న డీఆర్‌డీఓ-కంబ్యాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్.. 120 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 37 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల్లోపు (నవంబర్ 13, 2022) ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.500లు దరఖాస్తు రుసుమ చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు/షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.