DRDO-CEPTAM Recruitment 2022: డీఆర్‌డీఓ-సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌లో 1901 ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైతే చాలు..

|

Aug 25, 2022 | 8:26 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ - సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (DRDO - CEPTAM) దేశవ్యాప్తంగా ఉన్న పలు సెంటర్లలో.. 1075 సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి..

DRDO-CEPTAM Recruitment 2022: డీఆర్‌డీఓ-సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌లో 1901 ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైతే చాలు..
DRDO-CEPTAM 10 Recruitment 2022
Follow us on

DRDO – CEPTAM 10 Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ – సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (DRDO – CEPTAM) దేశవ్యాప్తంగా ఉన్న పలు సెంటర్లలో.. 1075 సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి, 826 టెక్నీషియన్‌-ఏ (Senior Technical Assistant-B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1901 సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి పోస్టులకు ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో డిప్లొమాల ఏదా బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నీషియన్‌-ఏ పోస్టులకు దరఖాస్తుల చేసుకునే వారు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఎవరైనా పై పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 23, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుమ చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.19.000ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి పోస్టులు ఖాళీల వివరాలు:

  • వ్యవసాయం పోస్టులు:10
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులు:15
  • బోటనీ పోస్టులు:3
  • కెమికల్ ఇంజనీరింగ్ పోస్టులు:35
  • రసాయన శాస్త్రం పోస్టులు:58
  • సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు: 25
  • కంప్యూటర్ సైన్స్ పోస్టులు: 167
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పోస్టులు:17
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 68
  • ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టులు:31
  • ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ పోస్టులు:192
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పోస్టులు: 17
  • లైబ్రరీ సైన్స్ పోస్టులు:23
  • మ్యాథ్‌మెటిక్స్‌ పోస్టులు: 13
  • మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు: 294
  • మెటలర్జీ పోస్టులు:21
  • మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (MLT) పోస్టులు:16
  • ఫోటోగ్రఫీ పోస్టులు:8
  • ఫిజిక్స్‌ పోస్టులు:32
  • ప్రింటింగ్ టెక్నాలజీ పోస్టులు: 5
  • సైకాలజీ పోస్టులు: 11
  • టెక్స్‌టైల్‌ పోస్టులు: 5
  • జువాలజీ పోస్టులు: 9

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.