DRDO Recruitment: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ రిసెర్చ్ సెంటర్ ఇమారత్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రక్షణ శాఖ పరిధిలోని ఈ సంస్థలో పలు అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (ఫిబ్రవరి 7) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 40, టెక్నీషియన్ (డిప్లొమా) 50, ట్రేడ్ అప్రెంటిస్ 60 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్‌లో ఇంజినీరింగ్, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.
* 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను అకడమిక్‌లో చూపిన ప్రతిభ, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ నేటితో 07-02-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: చాణక్య నీతి: ఈ నాలుగు చెడ్డ అలవాట్ల వల్ల ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడే మార్చుకోండి..?