DOST Special Drive 2023 Schedule: దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.. సెప్టెంబర్‌ 21 నుంచి రిజిస్ట్రేషన్లు

|

Sep 18, 2023 | 2:07 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇప్పటికే దోస్త్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసింది. తాజాగా మరోమారు దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి మరోసారి దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు జరపనున్నారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో అక్టోబరు 3, 4 తేదీల్లో స్పాట్‌ ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌..

DOST Special Drive 2023 Schedule: దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.. సెప్టెంబర్‌ 21 నుంచి రిజిస్ట్రేషన్లు
DOST Special Drive 2023
Follow us on

హైదరాబాద్‌, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇప్పటికే దోస్త్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసింది. తాజాగా మరోమారు దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి మరోసారి దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు జరపనున్నారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో అక్టోబరు 3, 4 తేదీల్లో స్పాట్‌ ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి సెప్టెంబర్‌ 16 షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో చేరిన వారు అదే కాలేజీలో మరో కోర్సులోకి మారేందుకు ఇంట్రా కాలేజీ రెండో విడతకు కూడా అనుమతి ఇస్తున్నట్లు విద్యామండలి ఛైర్మన్‌ తన ప్రకటనలో తెలిపారు. ఇక దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు సెప్టెంబర్‌ 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. వెబ్‌ అప్షన్లు ఇచ్చుకున్న వారందరికీ సెప్టెంబర్‌ 21న సీట్లు కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్‌కు విద్యార్ధులు ఒక్కక్కరు రూ.400 ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.

దోస్ట్ ప్రత్యేక విడత 2023 షెడ్యూల్‌ ఇదే..

  • రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 21 నుంచి 24 వరకు
  • వెబ్‌ ఆప్షన్ల నమోదు తేదీలు: సెప్టెంబర్‌ 21 నుంచి 25 వరకు
  • సీట్ల కేటాయింపు తేదీలు: సెప్టెంబర్‌ 29వ తేదీ
  • ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్ : సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో

తెలంగాణలో రూ.1447 కోట్ల వ్యయంతో కొత్తగా మరో 8 మెడికల్‌ కాలేజీలు

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం మరో 8 కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణానికి రూ.1447 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నిర్మించనున్న 8 కాలేజీలు గద్వాల, నర్సంపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్‌, నారాయణపేట, ములుగు, మెదక్‌, మహేశ్వరంలకు మంజూరైనట్లు రానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. వీటి భవనాలు, హాస్టళ్ల నిర్మాణానికి వైద్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యా కాలేజీలకు నిధుల కేటాయింపుపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకి ఒక డిగ్రీ కాలేజీ కూడా లేని పరిస్థితుల నుంచి జిల్లాకో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకునే స్థాయికి మన రాష్ట్రం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.