IAS: ఐఏఎస్‌ ఉద్యోగి జీతం ఎంతో తెలుసా.? ఈ ఉద్యోగానికి అందుకే ఇంత క్రేజ్‌..

|

Nov 13, 2023 | 10:24 PM

ఎన్నో కోట్ల మంది ఐఏఎస్ కోసం ప్రిపేర్‌ అయినా కొందరు మాత్రమే ఉద్యోగాన్ని సాధిస్తారు. ఇక ఈ ఉద్యోగం సాధిస్తే సమాజంలో గౌరవంతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. జీతంతో పాటు ప్రభుత్వం అందించే మరెన్నో అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఐఏఎస్ అధికారి అవుతారనే విషయం తెలిసిందే. ఇంతకీ ఐఏఎస్‌ అధికారులకు ఎంత జీతం అందిస్తారు.?

IAS: ఐఏఎస్‌ ఉద్యోగి జీతం ఎంతో తెలుసా.? ఈ ఉద్యోగానికి అందుకే ఇంత క్రేజ్‌..
Ias Officer
Follow us on

ఐఏఎస్ అధికారి కావాలనేది కోట్లాది మంది కల. చిన్ననాటి నుంచి ఐఏఎస్‌ అధికారి కావాలనే లక్ష్యంతో కృషి చేసే వారు ఎంతో మంది ఉన్నారు. రాత్రిపగలు అనే తేడా లేకుండా చదువుతారు. దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఐఏఎస్ ఒకటి. అత్యంత పోటీ ఉండే ఉద్యోగం కూడా ఇదే కావడం విశేషం.

ఎన్నో కోట్ల మంది ఐఏఎస్ కోసం ప్రిపేర్‌ అయినా కొందరు మాత్రమే ఉద్యోగాన్ని సాధిస్తారు. ఇక ఈ ఉద్యోగం సాధిస్తే సమాజంలో గౌరవంతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. జీతంతో పాటు ప్రభుత్వం అందించే మరెన్నో అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఐఏఎస్ అధికారి అవుతారనే విషయం తెలిసిందే. ఇంతకీ ఐఏఎస్‌ అధికారులకు ఎంత జీతం అందిస్తారు.? ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

యూపీఎస్‌సీలో ఉత్తీర్ణత సాధించిన వెంటనే మొదట డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత కొన్నేళ్లపాటు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తారు. అనంతరం కలెక్టర్‌ రాష్ట్ర పరిపాలన విభాగానికి డివిజినల్​ కమిషనర్​గా పదోన్నతి పొందవచ్చు. సదరు వ్యక్తి సామర్థ్యం, నాలెడ్జ్‌ ఆధారంగా ప్రభుత్వం వారి సేవలను ఉపయోగించుకుంటాయి. ఇక మరికొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తారు.

ఇక జీతం విషయానికొస్తే.. హోదానుబట్టి జీతాలు పొందుతారు. కలెక్టర్ల ప్రారంభ వేతనం రూ. 50,000గా ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్‌ ఆధారంగా రూ. 1,50,000 వరకు పొందొచ్చు. పనిచేస్తున్న విభాగాల ఆధారంగా రూ. 2,50,000 వరకు జీతం పొందొచ్చు. ఈ జీతంతో పాటు అదనంగా మరెన్నో అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. వీటికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఇంతకీ ఆ అదనపు ప్రయోజనాలు ఏంటంటే..

* ఐఏఎస్‌ అధికారులకు వారి ర్యాంకు, సీనియారిటీ ఆధారంగా ఇంటిని కేటాయిస్తారు. దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.

* ఇక ఐఏఎస్ అధికారులకు రవాణా సదుపాయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం వాహనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

* అధికారుల భద్రత విషయంలో కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ముగ్గురు హోం గార్డులతో పాటు, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్‌లను ప్రభుత్వం అందిస్తుంది.

* ఐఏఎస్ అధికారులకు నీరు, విద్యుత్, గ్యాస్‌, ఫోన్‌ వంటి మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుంది.

* ఇక ఐఏఎస్ అధికారులు పర్యటనల సమయంలో ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లలో సబ్సిడీతో వసతి పొందొచ్చు. అధికారిక లేదా అనధికార పర్యనటల్లో ఈ సబ్సిడీని పొందొచ్చు.

* ఏడేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అధికారులకు రెండేళ్ల స్టడీ లీవ్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే వెచ్చిస్తుంది.

* ఇక పదవి విరమణ తర్వాత కూడా ఐఏఎస్‌ అధికారులు పెన్షన్‌ పొందుతారు. జీవిత కాలంపాటు ఈ పెన్షన్‌ను అందిస్తారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..