ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద.. 21 మెడికల్ ఆఫీసర్, కుక్ కమ్ కేర్ టేకర్, అటెండెంట్/క్లీనర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఐదో తరగతి, పదో తరగతి, ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఏపీ మెడికల్ కౌన్సెల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు నవంబర్ 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన వారు ఆయా విభాగాన్ని బట్టి 52 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.
ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 13, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు అప్లికేషన్‌లను పంపించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.12,000ల నుంచి రూ.53,945ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 13
కుక్-కమ్-కేర్ టేకర్ పోస్టులు: 2
అటెండెంట్/ క్లీనర్ పోస్టులు: 1
సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు: 2
సెక్యూరిటీ గార్డ్ పోస్టులు: 3
District Medical & Health Officer, Kadapa, YSR District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.