DMHO Recruitment: ఇంటర్‌ అర్హతతో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Nov 10, 2022 | 8:20 PM

విజయనగరంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయములో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎన్‌టీఈపీ ప్రోగ్రాంలో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

DMHO Recruitment: ఇంటర్‌ అర్హతతో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Ap Govt Medcial Jobs
Follow us on

విజయనగరంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయములో ల్యాట్ టెక్నీషియన్, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్  ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎన్‌టీఈపీ ప్రోగ్రాంలో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ (01), సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్‌వైజర్ (02), ల్యాబ్ టెక్నీషియన్ (04) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జిల్లా క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాలి.

* ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్‌లకు నెలకు రూ. 19,019, మిగిలిన పోస్టులకు నెలకు రూ. 33,975 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు గడువు 17-11-2022తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..