DMHO Srikakulam Jobs 2022: శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఆరోగ్యమిత్ర ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌..

DMHO Srikakulam Jobs 2022: శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఆరోగ్యమిత్ర ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
DMHO Srikakulam Recruitment 2022

Updated on: Nov 10, 2022 | 2:54 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ ఎంఎల్‌టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం. అక్టోబర్‌ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు నవంబర్‌ 17, 2022వ తేదిలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: District Medical & Health Officer (DMHO), Srikakulam, AP.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.