Asha worker jobs: ఏపీలో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీ.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ. పూర్తి వివరాలు..

|

Dec 16, 2022 | 6:35 AM

ఆంధ్రప్రదేశ్‌ తాజాగా వరుసగా ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్నూలు జిల్లాలోని పట్టణ/ గ్రామీణ ప్రాంతాల్లోని యూపీహెచ్‌సీ/ పీహెచ్‌సీ పరిధిలో ఆశా వర్కర్ పోస్టులను..

Asha worker jobs: ఏపీలో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీ.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ. పూర్తి వివరాలు..
Asha Worker Posts
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ తాజాగా వరుసగా ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కర్నూలు జిల్లాలోని పట్టణ/ గ్రామీణ ప్రాంతాల్లోని యూపీహెచ్‌సీ/ పీహెచ్‌సీ పరిధిలో ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విషయమై కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో (శుక్రవారం) ముగియనున్న నేపథ్యంలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను సంబంధిత యూపీహెచ్‌సీ/ పీహెచ్‌సీల్లోని మెడికల్‌ ఆఫీసర్‌కు అందజేయాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్‌ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 16-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..