తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఆధ్వర్యంలోని హెల్త్ వెల్‌నెస్ సెంటర్లలో.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన సపోర్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నాలుగేళ్ల పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 15, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, ఖమ్మం జిల్లా, తెలంగాణ.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.