Delhi University: ఢిల్లీ యూనివ‌ర్సిటీలో భారీగా టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌..

|

Jan 24, 2022 | 9:05 AM

Delhi University Recruitment: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీచేసింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న ఈ సంస్థ‌లో ప‌లు స‌బ్జెక్టుల్లో ఉన్న టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవ‌రు అర్హులు.?

Delhi University: ఢిల్లీ యూనివ‌ర్సిటీలో భారీగా టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌..
Follow us on

Delhi University Recruitment: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీచేసింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న ఈ సంస్థ‌లో ప‌లు స‌బ్జెక్టుల్లో ఉన్న టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవ‌రు అర్హులు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న‌లో భాగంగా మొత్తం 635 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు (186), అసోసియేట్‌ ప్రొఫెసర్లు (449) ఖాళీలు ఉన్నాయి.

* ఆఫ్రికన్‌ స్టడీస్‌, ఆంథ్రపాలజీ, అరబిక్‌, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్‌, బోటనీ, బుద్దిస్ట్‌ స్టడీస్‌, కెమిస్ట్రీ, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎకనమిక్స్‌, ఇంగ్లిష్‌, జాగ్రఫీ, జాగ్రఫీ, జియాలజీ, హిందీ, లా విభాగాల్లో పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/ స్పెషలైజేషన్లలో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ముందుగా స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంత‌రం షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఇత‌రులు రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది.

* ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ క్లిక్ చేయండి..

* అసోసియేట్ ప్రొఫెస‌ర్‌ల నోటిఫికేష‌న్‌పై క్లిక్ చేయండి..

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Sleep Mistakes: మీరు బాగా నిద్రపోవాలంటే పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..?

NTR-Koratala: ఎన్టీఆర్‌ కొత్త సినిమా ప‌నులు షురూ.. రంగంలోకి దిగిన కొర‌టాల శివ‌..

ATM Notes: మీకు ఏటీఎంలలో చెల్లని, చిరిగిన నోట్లు వచ్చాయా..? ఇలా చేయండి..!