DRDO Recruitment 2021: ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉద్యోగాలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) శుభవార్త తెలిపింది. రక్షణ శాఖ పరిధిలోని ఈ సంస్థలో జూనియర్ రీసెర్చ్ ఫెలోఫిప్స్ అందిస్తోంది. బెంగళూరులోని ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (సీఏబీఎస్)లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 20 జూనియర్ రీసెర్చ్ ఫెలోఫిప్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 9, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 1, మెకానికల్ ఇంజినీరింగ్ 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన షెలోషిప్స్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్ చేసీ వ్యాలిడ్ గేట్ స్కోర్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గేట్ పరీక్షలో వచ్చిన స్కోరు, డిగ్రీ/పీజీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 30 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
* అభ్యర్థులు ముందుగా డీఆర్‌డీఓ అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.in లోకి వెళ్లాలి.
* అనంతరం ‘వాట్స్ న్యూ సెలక్షన్’లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* తర్వాత అప్లికేషన్ ఫామ్‌ను నింపి, సంబంధిత సర్టిఫికేట్లను అటాట్ చేయాలి.
* చివరగా సర్టిఫికేట్లను స్కాన్ చేసి jrf.rectt@cabs.drdo.in మెయిల్‌ఐడీకి పంపించాలి.
IIMC Admissions 2021 : IIMCలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..?