DFCCIL: రైల్వే శాఖలో 1074 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూలై 23.. పూర్తి వివరాలు..!

|

Jul 01, 2021 | 5:24 AM

DFCCIL Recruitment 2021 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న..

DFCCIL: రైల్వే శాఖలో 1074 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ జూలై 23.. పూర్తి వివరాలు..!
Follow us on

DFCCIL Recruitment 2021 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1074 ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల్లో ఎంపికైన వారు సివిల్‌, ఆపరేషన్స్‌ అలాగే మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలకు https://dfccil.com/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

విద్యార్హతలు:

జూనియర్ మేనేజర్: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, కంట్రోల్ మాన్యుఫాక్చర్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది.

వయసు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఎగ్జిక్యూటివ్: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, పవర్ సప్లయ్‌/అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు వేతనం ఉంటుంది.

వయస్సు: ఈ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

జూనియర్ ఎగ్జిక్యూటివ్: పదో తరగతి, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి వేతనం రూ. 25 వేల నుంచి రూ. 68 వేల వరకు ఉండనుంది.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి.

దరఖాస్తులకు చివరితేది: జూలై 23, 2021
కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్‌ తేది: 2021- సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో జరగనుంది.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌:https://dfccil.com/

ఇవీ కూడా చదవండి:

Osmania University Exams: ఓయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ 3, 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

TS Ed CET-2021: తెలంగాణ ఎడ్‌సెట్-2021 దరఖాస్తుల సమర్పణకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..