డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విశాటపట్నంలో ఉన్న ఈ కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (సోమవారం)తో ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో డ్రెడ్జ్ క్యాడెట్లు (15), ట్రైనీ మెరైన్ ఇంజినీర్లు (15), ఎన్‌సీవీ(ట్రైనీస్) (జీపీ రేటింగ్) (15) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి పదోతరగతి, ప్రీ-సీ జీపీ రేటింగ్ కోర్సు, నాటికల్ సైన్స్‌లో డిప్లొమా, మెరైన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30-11-2022 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు డ్రెడ్జ్ క్యాడెట్లకు రూ.15000, ట్రైనీ మెరైన్ ఇంజినీర్లకు రూ.25000, ఎన్‌సీవీ(ట్రైనీస్)కు రూ.10,000 చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (03-10-2022) ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..