CUET UG 2024 Exam Date: మే 15 నుంచి సీయూఈటీ యూజీ పరీక్షలు.. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

|

May 13, 2024 | 10:05 AM

దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ 202 (సీయూఈటీ) యూజీ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో పెన్‌, పేపర్‌ విధానంలో మే 24వ తేదీ వరకు నిర్వహించున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది..

CUET UG 2024 Exam Date: మే 15 నుంచి సీయూఈటీ యూజీ పరీక్షలు.. వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు
CUET UG 2024 Exam
Follow us on

హైదరాబాద్‌, మే 13: దేశవ్యాప్తంగా సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ యూనివర్సిటీస్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ 202 (సీయూఈటీ) యూజీ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో పెన్‌, పేపర్‌ విధానంలో మే 24వ తేదీ వరకు నిర్వహించున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. సీయూఈటీ యూజీలో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా యూనివర్సిటీలు , కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

మొత్తం 380 నగరాల్లో పరీక్షల నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏ నగరంలో పరీక్ష రాయనున్నరో ముందుగానే తెలియజేసే సిటీ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌ను ఇప్పటికే ఎన్టీయే విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది.

మే 20 తర్వాతే CBSE పది, 12వ తరగతుల పరీక్ష ఫలితాలు.. రిజల్ట్స్‌ వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షల ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతుం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల అనంతరం మే 20 తర్వాత సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల వెల్లడిపై స్పష్టత నిచ్చింది. మే 20వ తేదీ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని తన ప్రకటనలో బోర్డు పేర్కొంది. కాగా ఏడాది పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరగగా.. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్సీ నిర్వహించిన 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.