కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. న్యూఢిల్లీలో ఉన్న ఈ క్యాంపస్‌లో పలు విభాగాల్లో ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో క్యూరేటర్ (01), అసిస్టెంట్ (01), కాపీయర్ (01), ప్రొఫెషనల్ అసిస్టెంట్ (05), టెక్నికల్ అసిస్టెంట్(ల్యాబ్) (శిక్షశాస్త్ర/ ఎడ్యుకేషన్) (02), టెక్నికల్ అసిస్టెంట్(ల్యాబ్) (కంప్యూటర్) (05), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (08), లోయర్ డివిజన్ క్లర్క్ (23), లైబ్రరీ అటెండెంట్ (01), మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (24) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్, 12వ తరగతి, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 500, ఇతరులు రూ. 1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 07-11-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..