హుగ్లీ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌సీఎస్‌ఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఉన్న ఈ సంస్థలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో చీఫ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ (సివిల్) (01), మెడికల్ ఆఫీసర్ (01), నర్స్ (01), ప్రాజెక్ట్ ఆఫీసర్ (మెకానికల్) (02), ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్) (01), ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్) (01), ప్రాజెక్ట్ ఆఫీసర్(ఎలక్ట్రికల్ – క్వాలిటీ కంట్రోల్) (01), ప్రాజెక్ట్ అసిస్టెంట్(హెచ్‌ఆర్) (02), డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్) (01), ప్రాజెక్ట్ అసిస్టెంట్(అకౌంట్స్) (01), ప్రాజెక్ట్ అసిస్టెంట్(మెటీరియల్స్) (01), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (కమర్షియల్) (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* సీపీఈ, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 65 ఏళ్లు, ఇతర పోస్టులకు అప్లై చేసుకునే వారు 30 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 9-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..