CSIR UGC NET 2025 Exam: మరో 2 రోజుల్లోనే సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్ జూన్‌ 2025 రాత జులై 28వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

CSIR UGC NET 2025 Exam: మరో 2 రోజుల్లోనే సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
CSIR UGC NET 2025 Admit Card

Updated on: Jul 26, 2025 | 2:35 PM

హైదరాబాద్‌, జులై 26: సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) జూన్‌ 2025 రాత జులై 28వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను విడుదల చేసిన ఎన్టీయే ఈ మేరకు అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది. జులై 28న రెండు షిఫ్టుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ 2025 పరీక్షలో అర్హత సాధించిన వారు సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించడంతో పాటు జేఆర్‌ఎఫ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందిన విద్యార్ధులు సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, వర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు పొందొచ్చు.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యలోకి 74 హైస్కూల్‌ ప్లస్‌లు

ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూల్‌ ప్లస్‌ల్లోని ఇంటర్మీడియట్‌లో 30 మందికిపైగా విద్యార్థులున్న వాటిని ఇంటర్మీడియట్‌ విద్యా శాఖకు అప్పగించేందుకు సర్కార్‌ కసరత్తు చేస్తుంది. ప్రతి మండలంలోనూ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా జూనియర్‌ కాలేజీలు లేనిచోట్ల హైస్కూల్‌ ప్లస్‌ల్లోని ఇంటర్మీడియట్‌ను తీసుకోవాలని ఇంటర్మీడియట్‌ బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 74 హైస్కూల్‌ ప్లస్‌లను ఇంటర్‌ బోర్డు తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

మన్మోహన్‌సింగ్‌ వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తెలంగాణలో డిగ్రీ బీఎస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, బీఎస్సీ జియాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. దోస్త్‌ స్పెషల్ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ ఓఎస్‌డీ జగన్‌మోహన్‌రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు కోర్సులకు కలిపి మొత్తం 120 సీట్లు ఉన్నట్లు తెలిపారు. జులై 31 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తామని, ఆగస్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.