CSIR- NIIST Recruitment 2022: నెలకు రూ.47 వేల జీతంతో నిస్ట్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Nov 28, 2022 | 7:36 AM

కేరళలోని తిరువనంతపురంకు చెందిన సీఎస్‌ఐఆర్ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన 14 ప్రాజెక్ట్ అసోసియేట్-1, ఫీల్డ్‌ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర పోస్టుల భర్తీకి..

CSIR- NIIST Recruitment 2022: నెలకు రూ.47 వేల జీతంతో నిస్ట్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
CSIR NIIST
Follow us on

కేరళలోని తిరువనంతపురంకు చెందిన సీఎస్‌ఐఆర్ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన 14 ప్రాజెక్ట్ అసోసియేట్-1, ఫీల్డ్‌ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెటీరియల్‌ సైన్స్, బయోకెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌, బయోలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ తదితర విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్‌/గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 30, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.47,000ల వరకు జీతంతోపాటు, ఇతర అలెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చూడవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.