
CSIR-IHBT Project Associate Recruitment 2022: హిమాచల్ ప్రదేశ్‌లోని పాలంపూర్‌లో సీఎస్‌ఐఆర్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నీలజీ (IHBT).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 24
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్టులు, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.49,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/డిప్లొమా, ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్/గేట్ అర్హత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.
అడ్రస్: సీఎస్‌ఐఆర్ – ఐహెచ్‌బీటీ, పాలంపూర్, హిమాచల్‌ప్రదేశ్.
ఇంటర్వ్యూ తేదీ: 2022. జులై 8 నుంచి 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.