CSIR-CIMFR Dhanbad Laboratory Officer Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోనున్న సీఎస్ఐఆర్-సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (CSIR-CIMFR).. ఒప్పంద ప్రాతిపదికన 91 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి (Project Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఫిజిక్స్/జియోలజీలొ బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీలో అగ్రికల్చర్/బయోటెక్నాలజీ/లైఫ్ సైన్సెస్ లేదా కెమికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్/మెకానికల్ ఇంజనీరింగ్‌డిప్లొమా, బీఈ/బీటెక్, కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీలో పీజీ/జియోలజీ/అప్లైడ్ జియోలజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ లేదా సీఎస్ఐఆర్ యూసీజీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు సెస్టెంబర్ 27, 28, 29, 30 అక్టోబర్ 1, 6, 7, 8, 10, 11, 12 తేదీల్లో ఆయా అడ్రస్‌లలో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ. 31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.