CRPF Recruitment 2021: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 25 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* సివిల్ ఇంజినీర్ విభాగాల్లో అసిస్టెంట్ కమాండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 నుంచి 1,77,500 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తు చేసుకోవడానికి రూ. 400 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను రామ్‌పూర్, గ్రూప్ సెంటర్, డీఐజీ, ఉత్తరప్రదేశ్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల ప్రక్రియ 30-06-2021 నుంచి ప్రారంభమవుతుండగా.. చివరి తేదీని 29-07-2021గా నిర్ణయించారు.