భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. 99 ఇంజినీరింగ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్ / సివిల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా/ బీఈ/ బీఎస్సీ/ బీకామ్/ బీసీఏ/ ఇంజినీరింగ్ డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గేట్ 2021/ 2022/ 2023లో అర్హత సాధించాలి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 14, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000లు చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష/గేట్ స్కోర్/స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.