Govt Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

కాటన్‌ కార్పొరేషన్ ఆండియా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న మొత్తం 93 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Govt Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
Central Govt Jobs

Updated on: Jul 27, 2023 | 7:15 AM

కాటన్‌ కార్పొరేషన్ ఆండియా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న మొత్తం 93 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్)-6, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఖాతాలు)-6, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-81 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో MBA, CA/ CMA/ MBA / MMS/ M.Com/ PG, B.Sc పూర్తి చేసి ఉండాలి. జనరల్‌ అభ్యర్థులు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 13ని చివరి తేదీగా నిర్ణయించారు.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..