TET 2025 Notification: టెట్‌ నోటిఫికేషన్‌పై వీడని సందిగ్ధత.. నవంబరులో ప్రకటన విడుదలయ్యేనా?

ఈ ఏడాదికి టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) రెండో విడత నోటిఫికేషన్‌ నవంబరులో విడుదలపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్‌ జీఓలో సవరణలు చేయాల్సి ఉంది. దీంతో ఈ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తవుతుందా? లేదా? అనే అంశం ప్రశ్నార్ధకంగా మారింది. రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి..

TET 2025 Notification: టెట్‌ నోటిఫికేషన్‌పై వీడని సందిగ్ధత.. నవంబరులో ప్రకటన విడుదలయ్యేనా?
TG TET 2025 Notification

Updated on: Oct 06, 2025 | 6:28 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 6: తెలంగాణలో ఈ ఏడాదికి టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) రెండో విడత నోటిఫికేషన్‌ నవంబరులో విడుదలపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్‌ జీఓలో సవరణలు చేయాల్సి ఉంది. దీంతో ఈ ప్రక్రియ నెలరోజుల్లో పూర్తవుతుందా? లేదా? అనే అంశం ప్రశ్నార్ధకంగా మారింది. రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలకోసారి టెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి/ఏప్రిల్‌లో తొలి విడత, నవంబరు/డిసెంబరులో మలి విడత నోటిఫికేషన్లను జారీ చేస్తున్నారు. గత ఏడాది రెండో విడత నోటిఫికేషన్‌ నవంబరు 4న వచ్చింది. ఇక ఆ మరుసటిరోజు నుంచే అంటే నవంబర్‌ 5వ తేదీ నుంచే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈసారి మాత్రం నవంబరులో నోటిఫికేషన్‌ విడుదల సాధ్యమయ్యేలా కనిపించడంల లేదు.

ప్రస్తుతం ఆయా జిల్లాల్లో సర్వీసులోఉన్న ఉపాధ్యాయులు తమ ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్‌ తప్పనిసరిగా పాస్‌ కావాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబరు 1న చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ తేదీ నుంచి వచ్చే రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత కావాలని నిబంధన పెట్టింది. పైగా ప్రమోషన్‌ కావాలన్నా టెట్‌ పాస్‌ కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేసే వారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉచ్చింది. అయితే వీరు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్‌ పాసవ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో నవంబరులో టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలంటే.. 2015 డిసెంబరు 23న సర్కార్‌ జారీచేసిన జీఓ36కు సవరణ చేయాల్సి ఉంటుంది.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఇక రాష్ట్ర విద్యాశాఖ సైతం ఇదే ఆలోచనలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల రాష్ట్రంలో సుమారు 25వేల నుంచి 30వేల మంది టీచర్లపై ప్రభావం పడనుందని విద్యాశాఖ చెబుతోంది. కోర్టు తీర్పు ప్రకారం జీవోలో సవరణ చేయకుండా నోటిఫికేషన్‌ జారీ చేసే పరిస్థితి లేదు. అలాగని సవరణలు చేస్తే ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.